నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. కృష్ణా జలాల విషయంలో స్పందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. కృష్ణా ట్రిబ్యునల్ అంశంపై హరీశ్ రావు చిల్లర రాజకీయాలు చేశారంటూ ధ్వజమెత్తారు. పోతిరెడ్డి పాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కళ్లు మూసుకుని ప్రవర్తించారంటూ ఫైర్ అయ్యారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే కృష్ణా జలాల నీటి వాటాల్లో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎలా అన్యాయం చేశారనే దానికి సంబంధించి తమ వద్ద పూర్తిగా ఆధారాలు ఉన్నాయంటూ చెప్పారు.
298 టీఎంసీ లకే కేసిఆర్ సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ తమ వద్ద భద్రంగా ఉన్నాయని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. గత ప్రభుత్వం తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని ధ్వజమెత్తారు.