గంజాయి..డ్రగ్స్ పై ఉక్కుపాదం
ఏపీ హోం శాఖ మంత్రి అనిత
అమరావతి – ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కొప్పు గుండు పాలెం ఘటనపై స్పందించారు. ఈ ఘటన జరగడం బాధాకరమని పేర్కొన్నారు.
మైనర్ బాలికను అత్యాచారం చేయడమే కాకుండా హత్యకు పాల్పడడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వంగలపూడి అనిత. నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని చెప్పారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని పట్టుకుని తీరుతామని హెచ్చరించారు వంగలపూడి అనిత. ఒకవేళ ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం ఉంటే శాఖా పరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడితో మాట్లాడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు .
ఇక చీరాల ఘటనకు సంబంధించి కీలక అప్ డేట్స్ ఇచ్చారు హోం శాఖ మంత్రి. ఈ ఘటనలో నిందితుడిని 36 గంటల్లో పట్టుకున్నామని చెప్పారు. ఇదే సమయంలో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపుతున్నామని చెప్పారు.