హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత
అమరావతి – ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం దళితుల సంక్షేమమే ధ్యేయంగా పని చేసిందన్నారు మంత్రి వంగలపూడి అనిత. జగన్ ప్రభుత్వంలో దళితులపై దాడులు, దాష్టికాలు పెరిగాయన్నారు. తణుకు నియోజకవర్గంలో పర్యటించారు. రూ. 6.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. డా.బి.ఆర్.అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించారు. దళితుడ్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత వైసీపీ నాయకులదన్నారు. డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిగా ముద్రవేసి చనిపోయేలా చేశారని ఆరోపించారు.
ఒక మహిళా అధికారిని ఎన్నోరకాలుగా వేధించారని వాపోయారు అనిత. బంగారు కుటుంబం కాన్సెప్ట్ తో సీఎం చంద్రబాబు సమానత్వానికి అర్థం చెప్పారని అన్నారు. పీ4 విధానంలో అందరూ కలిసి అభివృద్ధి సాధిస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం కృషి చేస్తున్నారన్నారు. తణుకు, అత్తిలిలో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపనలతో పాటు కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు.