హోం మంత్రి వంగలపూడి అనిత
అమరావతి – ప్రజల భద్రతే కూటమి సర్కార్ లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి వంగలపూడి అనిత. గుంటూరు రేంజ్ లోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలతో సమీక్ష చేపట్టారు. హైకోర్టు, రాజధాని అమరావతి, సచివాలయం, పార్టీ కార్యాలయాలు, నివాసాల నేపథ్యంలో భద్రతపై మరింత దృష్టి పెట్టే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.
గత మూడు నెలల్లో ప్రకాశం జిల్లాలో సైబర్ నేరాలు జరగ లేదన్నారు. గుంటూరు, బాపట్ల ప్రాంతాల్లో సైబర్ నేరాలను ఛేదించామన్నారు. నెల్లూరు జిల్లా సహా అన్ని చోట్ల సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
మహిళా పోలీసుల ద్వారా అవగాహన పెంచి నేరాల పట్ల ప్రతి కుటుంబాన్ని జాగృతి చేస్తామన్నారు మంత్రి వంగలపూడి అనిత. పోలీస్ స్టేషన్ల ఆధునికీరణపై ప్రత్యేకంగా దృష్టి పెడతామన్నారు. గుంటూరు జిల్లాలో ఎక్కువ పోలీసు బలగాల అవసనరం ఉందని చెప్పారు. డ్యూటీ చేసే పోలీసులకు వసతులు కల్పిస్తామన్నారు. గుంటూరు రేంజ్ పరిధిలో ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వం చేపట్టల్సిన అంశాలపై చర్చించడం జరిగిందన్నారు. పోక్సో కేసులను వేగంగా దర్యాప్తు చేసి శిక్షపడేలా చేస్తున్నామన్నారు. ఏళ్లకేళ్లు దాటినా శిక్షపడని స్థాయి నుంచి 4,5 నెలల్లోనే శిక్షపడేలా కృషి చేసినట్లు తెలిపారు వంగలపూడి అనిత.