Friday, April 4, 2025
HomeNEWSANDHRA PRADESHచంద్ర‌బాబు నాయుడు డైన‌మిక్ లీడ‌ర్

చంద్ర‌బాబు నాయుడు డైన‌మిక్ లీడ‌ర్

ప్ర‌శంస‌లు కురిపించిన మంత్రి అనిత

అమ‌రావ‌తి – ఏపీ సీఎం చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితం స్పూర్తి దాయ‌క‌మ‌ని అన్నారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. అవిశ్రాంత పోరాట శిఖరమ‌ని, అవిరళ కృషికి నిలువెత్తు నిదర్శనమ‌న్నారు. కఠోర శ్రమ..క్రమశిక్షణలే ఆయుధం.. కార్యకర్తలే బలం, బలగంగా ముందుకు వెళుతున్న బాబు త‌న‌కు ఆద‌ర్శ‌మ‌న్నారు. స‌రిగ్గా ఇదే రోజు 47 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా చంద్ర‌బాబు ప్ర‌స్థానం మొద‌లైంద‌ని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో మరో మలుపు తీసుకుందన్నారు. పార్టీని తిరుగులేని శక్తిగా మార్చే క్రమంలో ఎదురైన అవమానాలను ఆభరణాలుగా మలుచుకొని ముందుకు సాగుతున్నార‌ని కొనియాడారు.

చంద్ర‌బాబు నాయుడు గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు. ఏళ్లు గ‌డిచే కొద్దీ ఆయ‌న‌లో ప‌ట్టుద‌ల పెరుగుతోందే త‌ప్పా ఏనాడూ త‌గ్గిన దాఖ‌లాలు లేవ‌న్నారు అనిత వంగ‌ల‌పూడి. సంక్షోభాలను సానుకూల అవకాశాలుగా మార్చుకొని..మంత్రిగా, ముఖ్యమంత్రిగా చేసిన పోరాటాలు, రాష్ట్ర చరిత్ర గతిని మార్చిన మైలురాళ్ల గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు. చంద్ర‌బాబు త‌న 50 ఏళ్ల రాజకీయ జీవితం.. ఎంతోమందికి ఆదర్శంగా ఉంటుంద‌న్నారు. ఆయ‌న నాయకత్వం స్ఫూర్తి దాయకం.. దైవ సమానులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు వంగ‌ల‌పూడి అనిత‌.

RELATED ARTICLES

Most Popular

Recent Comments