స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి
అమరావతి – పోలీసు సంక్షేమం తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి వంగలపూడి అనిత.
ప్రభుత్వ అనుమతులు రాగానే పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. కోర్టు చిక్కుముడులను అధిగమించి 1995 బ్యాచ్‌కు ప్రమోషన్లు కల్పిస్తామని ప్రకటించారు. కోర్టు అనుమతితో కమిటీ ఏర్పాటు చేసి ప్రమోషన్ సమస్యకు పరిష్కారం చూస్తామన్నారు. ట్రైబల్ బెటాలియన్ కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించామని చెప్పారు. కూటమి సర్కార్ ప్రజల భద్రత కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న పోలీసు కుటుంబాలకు మేలు చేకూర్చేలా చేస్తామన్నారు వంగలపూడి అనిత.
రాష్ట్రంలో పోలీస్ శాఖ పరంగా అద్బుతంగా పని చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు హోం మంత్రి. చాలా చోట్ల చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి కీలకంగా మారారని పేర్కొన్నారు. ఇదే సమయంలో డ్రగ్స్, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఈగల్ టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. దీని కారణంగా చిన్నారులు, యువత వాటి బారిన పడకుండా ఉండేలా జాగ్రత్త పడడం జరుగుతుందన్నారు. ఇక హెల్మెట్ ధరించక పోవడం పట్ల కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అనిత వంగలపూడి. గతంలో రూ. 100 జరిమానా విధించే వారని, దీంతో దానిని లైట్ గా తీసుకున్నారని వాహనదారులు. కానీ తాము వచ్చాక కావాలని ఫైన్ ను రూ. 1000కి పెంచడం జరిగిందన్నారు .