విజయసాయి రెడ్డి నోరు జాగ్రత్త
స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి
అమరావతి – ఏపీ హొం , విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జర నోరు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఇక నుంచి నోరు జారితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.
సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు విజయ సాయి రెడ్డిని ఉద్దేశించి. కనీస విలువలు లేకుండా వ్యక్తిగతంగా దూషించడం మంచి పద్దతి కాదన్నారు వంగలపూడి అనిత. పెద్దవాళ్లపై పనిగట్టుకుని నీచంగా కామెంట్స్ చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
వైసీపీ పాపాలు బయటపడుతున్న కొద్దీ ట్వీట్లు పెరిగాయని ఫైర్ అయ్యారు. కనీస విలువలు లేని శకుని లాంటి వ్యక్తి విజయసాయిరెడ్డి అంటూ ధ్వజమెత్తారు. పెద్దవాళ్లపై పనిగట్టుకుని విజయసాయి రెడ్డి మాటలు బాధాకరమని అన్నారు. గత పాలనలో వైసీపీ నేతలు అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డారంటూ ఫైర్ అయ్యారు వంగలపూడి అనిత.