Monday, April 21, 2025
HomeNEWSANDHRA PRADESHప‌ర‌వాడ ఫార్మా ప్ర‌మాదంపై దిగ్భ్రాంతి

ప‌ర‌వాడ ఫార్మా ప్ర‌మాదంపై దిగ్భ్రాంతి

ద‌ర్యాప్తునకు ఆదేశించిన ఏపీ స‌ర్కార్

అమరావ‌తి – పరవాడ ఫార్మా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు మంత్రి వాసం శెట్టి సుభాష్. ఫార్మా కారాగారంలో వ‌రుస ప్రమాదాలు చోటు చేసుకోవ‌డం ప‌ట్ల ఆవేద‌న చెందారు.

ర‌క్షిత డ్ర‌గ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్మికుల‌కు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామ‌ని అన్నారు. విష వాయువు లీకేజీ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రిపిస్తామ‌న్నారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన సంస్థ‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు.

ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారుల‌ను ఆదేశించిడం జ‌రిగింద‌ని చెప్పారు మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇదే సంస్థ‌లో ప‌దే ప‌దే ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఏపీ కార్మిక శాఖ ఏం చేస్తోందంటూ బాధితులు ప్ర‌శ్నిస్తున్నారు.

త‌మ ప్ర‌భుత్వం ఎట్టి ప‌రిస్థితుల్లో ఇలాంటి ఘ‌ట‌న‌ల ప‌ట్ల ఉపేక్షించే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. బాధితుల‌ను తాము ఆదుకుంటామ‌ని, ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments