నిప్పులు చెరిగిన వాసంశెట్టి సుభాష్
అమరావతి – మంత్రి వాసంశెట్టి సుభాష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మండిపడ్డారు. తను లీడర్ కాదని పొలిటికల్ బ్రోకర్ అన్నారు. ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని, జగన్ అండ చూసుకుని రెచ్చి పోయాడని, కబ్జాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. వంశీ చేసిన అరాచకాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. తాము కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం లేదన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, ఇది శాంపిల్ మాత్రమేనని ఇంకా చాలా మంది ఉన్నారన్నారు.
శుక్రవారం వాసం శెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ పాపం పండి జైలుకి వెళ్ళాడన్నారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించు కోలేరన్నారు. . తెలుగుదేశం పార్టీ పేరుతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వంశీ తదుపరి సొంత పార్టీని పక్కనపెట్టి తన స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ తో చేతులు కలిపి విధ్వంసాలు సృష్టించాడని మండిపడ్డారు.
తన అనుచరులతో వేలాది ఎకరాలు కబ్జా చేశాడని వాటన్నింటిపై తమ సర్కార్ విచారణ జరుపుతుందన్నారు. ప్రముఖ రాజకీయ నాయకుల అక్రమ మైనింగ్లకు పవర్ బ్రోకర్ వంశీ అంటూ విమర్శించారు.
భూమి అభివృద్ధి పేరుతో ఎకరాకు పది లక్షల రూపాయలు చొప్పున 170 కోట్లు రూపాయలు నొక్కేసిన వంశీ నీతిమంతుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు మంత్రి వాసం శెట్టి సుభాష్. స్వార్థంతో తహసిల్దార్ సంతకం ఫోర్జరీ చేసి భూములు కొట్టేసిన ఘనుడ అంటూ ఎద్దేవా చేశారు.