Wednesday, April 9, 2025
HomeNEWSANDHRA PRADESHవిద్యా రంగం అభివృద్దిపై స‌ర్కార్ ఫోక‌స్

విద్యా రంగం అభివృద్దిపై స‌ర్కార్ ఫోక‌స్

కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్

అమ‌రావ‌తి – టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం విద్యా రంగం అభివృద్దికి పెద్ద‌పీట వేస్తోంద‌ని చెప్పారు కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్. ఆంగ్ల బోధ‌న‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌న్నారు. విద్యార్థులు ఇబ్బందులు ప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై దృష్టి సారించామ‌ని, ఏపీని ఐటీ , ఏఐ హ‌బ్ గా మార్చేందుకు సీఎం చంద్ర‌బాబు , మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నార‌ని చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు త్వ‌ర‌లో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తామ‌న్నారు.

కృష్ణాజిల్లా పెనమలూరు లో ఆర్ వి ఎస్ అను విద్యానికేతన్లో ఆంగ్ల ఉన్నత పాఠశాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాల‌ని సూచించారు.

పాఠశాలకు , గ్రామాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకు రావాల‌ని పిలుపునిచ్చారు మంత్రి వాసంశెట్టి సుభాష్. మాతృభాషతో పాటు ఆంగ్ల విద్యను కూడా అభ్యసించిన నాడు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యార్థులు నేర్చుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, బీసీ నాయ‌కులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments