స్పష్టం చేసిన మంత్రి వాసం శెట్టి సుభాష్
అమరావతి – కర్మాగారాల్లో జరుగుతున్న ప్రమాదాలపై నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు మంత్రి వాసం శెట్టి సుభాష్. సచివాలయంలో కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలు చూచనలు చేశారు. నిర్లక్ష్యం కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన చెందారు. ఆడిట్ సరిగ్గా జరగక పోవడం కూడా మరో కారణమన్నారు.
ప్రమాదాలు, కార్మికుల భద్రతపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా ఇన్స్పెక్షన్లు కర్మాగారాలలో రెగ్యులర్ గా చేపట్టాలన్నారు. ఫ్యాక్టరీల్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఎల్ వో టి సెన్సార్లను పూర్తి స్థాయిలో ఉపయోగించాలని స్పష్టం చేశారు మంత్రి వాసంశెట్టి సుభాష్.
CFS ద్వారా ఇన్స్పెక్షన్స్, ఆడిట్స్ కి వెళ్లే వారికీ మొబైల్ ట్రాకింగ్ యాప్ ద్వారా ప్రతి సమాచారం తెలుసుకునే ఛాన్స్ ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కెమికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారిని డెప్యూటేషన్ మీద అందుబాటులో తీసుకు రావాలన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టామన్నారు. ప్రమాదాలు వాటి భద్రత ఆడిట్లను కచ్చితంగా కర్మాగారాలలో చేపట్టాలన్నారు. అధికారులు ఏమాత్రం విధులు పట్ల నిర్లక్ష్యంగా ఉన్నా దానికి తగ్గ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఫ్యాక్టరీలు లేబర్ వెబ్సైట్లను ప్రారంభించారు మంత్రి.