టీడీపీ గొప్ప నేతను కోల్పోయింది
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతాపం
అమరావతి – తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతిపట్ల రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతాపం ప్రకటించారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (ప్రస్తుతం అనకాపల్లి జిల్లా) చీడికాడ మండలం పెదగోగాడ కు చెందిన రెడ్డి సత్యనారాయణ 1983 నుంచి 2004 వరకు (వరుసగా ఐదు సార్లు) శాసనసభ్యుడిగా పని చేశారని తెలిపారు.
దివంగత ఎన్టీఆర్ మంత్రివర్గంలో రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రిగా, టిటిడి బోర్డు సభ్యుడిగా, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ గా వివిధ హోదాలలో పనిచేసి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు.
రెడ్డి సత్యనారాయణ లాంటి వ్యక్తులు సమకాలీన రాజకీయాల్లో అరుదుగా ఉంటారని అన్నారు. ఆయన అకాల మృతి తనను తీవ్ర ఆవేదన గురి చేసిందని, సత్యనారాయణ లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ఆయన జీవితం భవిష్యత్తు తరాలకు ఆదర్శమని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు కొండపల్లి శ్రీనివాస్.