ప్రతి నెలా రూ. 270 కోట్లు చెల్లించాం
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్లారిటీ
హైదరాబాద్ – మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. ప్రతి నెలా రూ. 270 కోట్లు విడుదల చేస్తూ వచ్చామని, ఇంకెక్కడ బకాయిలు ఉంటాయని ప్రశ్నించారు. మరో వైపు దాసరి సీతక్క బకాయిలు తమపై మోపారని ఆరోపించారు. కాగా దుద్దిళ్ల బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకం కారణంగానే ఆత్మహత్యలకు ఉప సర్పంచ్ లు పాల్పడ్డారంటూ వాపోయారు.
ఇదిలా ఉండగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రేషన్ బియ్యం రవాణాపై అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలి పోతున్నట్లు తమ దృష్టికి కూడా వచ్చిందన్నారు. దానిపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని రేషన్ దుకాణాలలో లబ్దిదారులకు అందజేస్తున్న బియ్యం నాణ్యతగా ఉండడం లేదని వాడడం లేదన్నారు. కొందరు మాత్రమే తీసుకు వెళుతున్నారని తెలిపారు.
ఇదిలా ఉండగా తాజాగా సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఈ మేరకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇక ఆయా రేషన్ డీలర్ల భర్తీకి సంబంధించి జిల్లాల కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.