ENTERTAINMENT

కేర‌ళ న‌టుల లైంగిక వేధింపులు – మునీర్

Share it with your family & friends

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌ముఖ న‌టి

కేర‌ళ – ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టి మిను మునీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే క్యాస్టింగ్ కౌచ్ పై సినిమా రంగంలో ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి మిను మునీర్ బాంబు పేల్చారు.

మ‌లయాళ సినీ రంగంలో టాప్ హీరోలుగా కొన‌సాగుతున్న వారిలో కొంద‌రు త‌న ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరుపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సోమ‌వారం ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు. తాను ఎలా లైంగిక వేధింపుల‌కు లోన‌య్యాన‌ని చెప్ప‌డం క‌ల‌క‌లం రేపింది.

స‌హ న‌టులు త‌న ప‌ట్ల అస‌భ్యంగా వ్య‌వ‌హ‌రించారంటూ వాపోయింది. ఒకసారి తాను టాయిలెట్ నుండి బయటకు వస్తుండగా జయసూర్య నన్ను వెనుక నుండి కౌగిలించుకున్నాడ‌ని ఆరోపించారు. అంతే కాకుండా త‌న‌ను బ‌ల‌వంతంగా ముద్దు పెట్టుకున్నాడ‌ని మండిప‌డ్డారు.

ఒకసారి తాను కొత్త షూట్ లొకేషన్‌కి వెళుతున్నప్పుడు మణియం పిల్ల రాజు నాతో పాటు కారులో కూర్చుని, నా భర్త గురించి అడిగాడ‌ని, త‌ను లేన‌ప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రిస్తావంటూ ప్ర‌శ్నించాడ‌ని ఆరోపించారు.

మణియంపిల్ల రాజు ఒకసారి రాత్రి పూట హోటల్ తలుపు తెరిచి ఉంచాలని నాకు చెప్పారని, దానికి తాను నిరాక‌రించాన‌ని ఆ త‌ర్వాత త‌న‌కు సినిమాల‌లో ఛాన్స్ లు రాలేద‌ని వాపోయింది న‌టి మిను మునీర్.