పుస్తకాలు బహుమతిగా ఇవ్వండి
పిలుపునిచ్చిన సీఎం ఎంకే స్టాలిన్
తమిళనాడు – రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పుస్తకాలు చదవడం జీవితంలో తప్పనిసరి కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పుస్తకాలు అజ్ఞానాన్ని తొలగించేందుకు సాధనాలుగా ఉపయోగ పడతాయని స్పష్టం చేశారు .
పుస్తకాలు చదవడం వల్ల అంతులేని ఆత్మ విశ్వాసం నెలకొంటుందని తెలిపారు. అవి జ్ఞానంతో పాటు విలువలు కూడా పెంపొందించేలా చేస్తాయని అన్నారు సీఎం. బుక్స్ అనేవి జ్ఞానానికి మూలం, విద్య పొందేందుకు పునాది అని , ఆలోచనలను ప్రేరేపించేందుకు దోహదం చేస్తాయని వెల్లడించారు ఎంకే స్టాలిన్.
జీవితంలో దేనినైనా పొందాలన్నా, విజయం సాధించాలంటే పుస్తకాలను మించిన ఆధారం ఏదీ ఈ లోకంలో లేదన్నారు. ప్రజలలో మరింత అవగాహన కల్పించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. మానవ సమాజాన్ని సుసంపన్నం చేసేందుకు ఓ బహుమతిగా తాను భావిస్తానని స్పష్టం చేశారు సీఎం.
పుస్తకాలను చదవాలని, బహుమతిగా ఇవ్వాలని సూచించారు. పుస్తకాల మార్పిడిని ఉద్యమంలా ప్రారంభించాలని పిలుపునిచ్చారు ఎంకే స్టాలిన్. తాను సీఎంగా అయ్యాక రెండున్నర లక్షలకు పైగా పుస్తకాలను విద్యార్థుల కోసం అందించామని తెలిపారు.