ప్రారంభించిన సీఎం ఎంకే స్టాలిన్
తమిళనాడు – దేశంలోనే తొలిసారిగా తమిళనాడు లోని కన్యాకుమారి లో నిర్మించిన ఫైబర్ గ్లాస్ వంతెనను మంగళవారం ప్రారంభించారు సీఎం ఎంకే స్టాలిన్. దీనిని రూ. 37 కోట్లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ వంతెన పొడవు 77 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు. 133 అడుగుల తిరువళ్లువర్ విగ్రహం, వివేకానంద స్మారక మండపం కలిపేలా దీనిని ఏర్పాటు చేశారు. 2000లో దివంగత సీఎం కరుణానిధి హయాంలో తిరువళ్లువర్ విగ్రహాన్ని ప్రతిష్టించారు.
ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగి జనవరి 1వ తేదీకి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రెండు రోజుల పాటు రజతోత్సవాలు నిర్వహించనుంది తమిళనాడు ప్రభుత్వం. 1.06 కిలోమీటర్ల మేర ఉన్న మొదటి ఫ్లై ఓవర్ వాహనదారులు మేడవాక్కం – షోలింగనల్లూరు రహదారి, వేదవాక్కం – మంబాక్కం రహదారిని దాటేందుకు ఇది సహాయ పడుతుంది.
ఇదే సమయంలో గతంలో కోయంబేడు ఫ్లై ఓవర్ ను గత ఏడాది ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. రాష్ట్ర రహదారుల శాఖ ద్వారా వెలచ్చేరి – తాంబరం రేడియల్ రోడ్డులో రెండు ఏకదిశల మూడు లేన్ల ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు.