ఎమ్మెల్యేల నిర్వాకం అక్బరుద్దీన్ ఆగ్రహం
ఇదేనా కేసీఆర్ మీకు నేర్పించిందంటూ ఫైర్
హైదరాబాద్ – ఎంఐఎం శాసన సభ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ నిప్పులు చెరిగారు. శాసన సభలో శుక్రవారం భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అనుసరించిన తీరుపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. బీఆర్ఎస్ నేతలకు ప్రజలు అవసరం లేదన్నారు. వారికి కేవలం వారి ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అందుకే వారిని అధికారంలో లేకుండా చేశారని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనపై అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.. అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజు అని మండిపడ్డారు.. ఓ కుటుంబం కోసమే బీఆర్ఎస్ ఆందోళన చేపడుతోందని ఆరోపించారు . బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే బీఆర్ఎస్ సంస్కృతి అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
ఇలాగే అడ్డుకోవాలని బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ నేర్పించింది ఇదే అంటూ సీరియస్ అయ్యారు. ఒక ఎమ్మెల్యే కోసమే ఇదంతా చేస్తున్నారంటూ ఊగి పోయారు అక్బరుద్దీన్ ఓవైసీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రచ్చ చేయడం తగదన్నారు. వారికి ప్రజా సమస్యల కంటే పార్టీనే ముఖ్యమంటూ ఎద్దేవా చేశారు.