పాడి కౌశిక్ రెడ్డి ఇజ్జత్ లేనోడు – గాంధీ
కొనసాగుతున్న సవాళ్ల పర్వం
హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇదే సమయంలో దమ్ముంటే తన ఇంటికి రావాలని లేదంటే తాను కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తానంటూ ప్రకటించారు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.
ఈ సందర్బంగా ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చారు. విమర్శలు చేసుకున్నారు. రాజకీయాలను మరింత రక్తి కట్టించేలా చేశారు. విచిత్రం ఏమిటంటే ఓ వైపు ప్రజలు ఎన్నుకున్నది సవాళ్లు విసురుకునేందుకేనా అన్న అనుమానం తలెత్తుతోంది.
శాసన సభలో సమస్యలను ప్రస్తావించరు. పోనీ బయట ఏమైనా పని చేస్తున్నారా అంటే అదీ లేదు. మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి , బీఆర్ఎస్ నుంచి జంప్ అయి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చకున్న అరికెపూడి గాంధీల మధ్య డైలాగ్ వార్ జనానికి విసుగు పుట్టించేలా చేస్తోంది.
ఇజ్జత్ లేనోళ్లకు నేను సమాధానం చెప్పను.. ఎమ్మెల్యే అరికెపూడి మాస్ వార్నింగ్