నటుడు నందమూరి బాలకృష్ణ
అనంతపురం జిల్లా – నటుడు బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా తనకు పద్మభూషణ్ అవార్డు రావడం మరింత కసి పెంచిందన్నారు. నాకు ఎవరూ ఛాలెంజ్ కాదని, నాకు నేనే ఛాలెంజ్ అంటూ స్పష్టం చేశారు. సినిమా, రాజకీయాలను సమానంగా చూస్తానని అన్నారు. తనను ఆదరిస్తూ వస్తున్న నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇదిలా ఉండగా సోమవారం అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరిగింది. దీనిని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ, వైసీపీ మధ్య పోటీ నెలకొంది. మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ అభ్యర్థి రమేష్ ఎన్నికయ్యారు. 23 మంది కౌన్సిర్లు మద్దతు పలికారు. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి 14 మంది మాత్రమే సపోర్ట్ చేశారు. దీంతో రమేష్ ఎన్నికైనట్లు ప్రకటించారు ఎన్నికల అధికారి.
ఈ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారనే దానిపై. చివరకు హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న నటుడు నందమూరి బాలకృష్ణ చక్రం తిప్పారు. వైసీపీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఎంపీ పార్థసారథితో పాటు బాలయ్య కూడా ఓటు వేశారు. మరో ముగ్గురు సభ్యులు గైర్హాజర్ అయ్యారు.
టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జై బాలయ్య అంటూ ..సంబురాలు చేసుకున్నారు. మరో వైపు నెల్లూరు, ఏలూరు మున్సిపాలిటీలు కూడా టీడీపీ కైవసం చేసుకుంది. నెల్లూరు డిప్యూటీ మేయర్ గా టీడీపీ సపోర్ట్ చేసిన తహసీన్ ఎన్నికయ్యారు. 29 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆమెకు 41 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి కరీముల్లాకు 12 ఓట్లు మాత్రమే వచ్చాయి.