బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల జంప్
కాంగ్రెస్ కండువా కప్పిన సీఎం
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గద్వాల జోగులాంబ జిల్లాలోని గద్వాల శాసన సభ నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. శనివారం ఆయన తను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అనంతరం సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి జూపల్లి కృష్ణా రావు తో పాటు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు సైతం గుడ్ బై చెప్పారు. తాము ఇక ఉండలేమంటూ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ లో కేసీఆర్ ఫ్యామిలీ తప్పా ఏ ఒక్కరు ఉండరంటూ సీఎం ప్రకటించారు. అన్నట్టు గానే తన ప్లాన్ ను అమలు చేస్తూ వెళుతున్నారు.