బన్నీపై భగ్గుమన్న బోలిశెట్టి
ఎమ్మెల్యే సీరియస్ కామెంట్స్
అమరావతి – జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాసులు షాకింగ్ కామెంట్స్ చేశారు. మెగా ఫ్యామిలీకి చెందిన ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అలియాస్ బన్నీపై నిప్పులు చెరిగారు. తనకు అంత సీన్ లేదన్నారు.
బన్నీకి ఉన్న ఫ్యాన్స్ అంతా మెగా ఫ్యామిలీకి చెందిన వారేనని అన్నారు. అల్లు అర్జున్ ఏమైనా పుడింగా అంటూ ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాసులు. ఆయన గత ఎన్నికల్లో ప్రచారం చేయక పోయినా తమకు వచ్చిన నష్టం ఏమీ జరగ లేదని అన్నారు.
విచిత్రం ఏమిటంటే బన్నీ స్వంతంగా పనిగట్టుకుని వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతుగా ప్రచారం చేసినా అక్కడ ఓడి పోయిందని , అంటే అర్థం బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ లేదని తేలి పోయిందన్నారు ఎమ్మెల్యే.
తాము పోటీ చేసిన 21 శాసన సభ స్థానాలతో పాటు 2 లోక్ సభ స్థానాలలో జనసేన అద్భుతమైన విజయం సాధించిందని చెప్పారు బోలిశెట్టి శ్రీనివాసులు. అల్లు అర్జున్ తన స్థాయిని మరిచి పోయి మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు.
ఇక నుంచైనా తన స్థాయి ఏమిటో గుర్తు పెట్టుకుని కామెంట్స్ చేస్తే బావుంటుందని సూచనలు చేశారు జనసేన పార్టీ ఎమ్మెల్యే. ఇదిలా ఉండగా ఇటీవలే జనసేన పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అల్లు అర్జున్ ను ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేయడం కలకలం రేపింది.