ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కామెంట్స్
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీపై సీరియస్ కామెంట్స్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఆడబిడ్డలపై నోరు పారేసుకున్న వంశీ అరెస్ట్ సక్రమమేనని అన్నారు. ఇలాంటి వ్యక్తికి సపోర్ట్ గా మాట్లాడుతున్న అంబటి రాంబాబును కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తన కేరెక్టర్ గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. ఇకనైనా రంకెలు వేయడం మానుకుంటే మంచిదని సూచించారు. తప్పు చేసిన వారు చట్టం ముందు తప్పించు కోలేరని అన్నారు. వంశీ జైలుకు వెళ్లడానికి ప్రధాన కారకుడు జగనేనని ఆరోపించారు.
చింతమనేని ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ఆడబిడ్డలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వంశీ నాలుకను బయటకు లాగి కోసినా తప్పులేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వంశీ మాట్లాడుతుంటే జగన్ పకపకా నవ్వాడని, బలం ఉందని నాడు ఇష్టం వచ్చినట్లు రెచ్చి పోయారంటూ ధ్వజమెత్తారు.
వంశీ జైలుకు వెళ్లడానికి కారణం జగన్ కాదా అని ప్రశ్నించారు. తన కోసం పని చేసిన వంశీని పరామర్శించకుండా బెంగళూరు ఎందుకు వెళ్లాడో చెప్పాలన్నారు. ఇలాంటి వ్యక్తి అరెస్ట్ అయితే ఆంబోతులా రాంబాబు అరుస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు చింతమనేని ప్రభాకర్.
వంశీ అరెస్ట్ ను అక్రమం అని వైసీపీ నేతలు మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. వంశీ ఏతప్పు చేయకుండా గన్నవరం టీడీపీ కార్యాలయం తగలబడుతుందా? మీరు అధికారంలో ఉండి నాడు మీ తప్పులను కప్పి పెట్టారంటూ నిప్పులు చెరిగారు.