దానం..రంజిత్ రెడ్డి జంప్
బీఆర్ఎస్ కు బిగ్ షాక్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో జంపింగ్ జపాంగ్ లు ఎక్కువయ్యారు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఏ పార్టీలో చేరుతారో తెలియని పరిస్థితి నెలకొంది. అహంకారంతో మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి సర్కార్ ఉండదంటూ చిల్లర మాటలు మాట్లాడుకుంటూ వచ్చారు.
దీంతో దీనిని సీరియస్ గా తీసుకున్నారు సీఎం. ఆ వెంటనే ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. ప్లాన్ వర్కవుట్ అయ్యింది. ఇప్పటి దాకా బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న నేతలు జంప్ అయ్యారు. ముందుగా మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
తాజాగా ఆయన సరసన మరో ఇద్దరు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ సమక్షంలో హస్తం గూటికి చేరారు. వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ , మరొకరు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. ఈ ఇద్దరిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
నిన్నటి దాకా పొర్లు పొర్లు తిట్లు తిట్టిన రేవంత్ రెడ్డి ఎవరి ప్రయోజనాల కోసం వారిని తమ పార్టీలోకి చేర్చుకున్నారనేది చెప్పలేక పోయారు. మొత్తంగా బీఆర్ఎస్ ను ఖాళీ చేసే పనిలో ఉన్నారనేది మాత్రం వాస్తవం.