హైడ్రా కమిషనర్ పై దానం కన్నెర్ర
నా మీదే కేసు నమోదు చేస్తావా
హైదరాబాద్ – ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నోటికి పని చెప్పారు. ఆయన ఏకంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై మండిపడ్డారు. నాపైనే కేసు నమోదు చేయిస్తావా అంటూ ఫైర్ అయ్యారు. మంగళవారం దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు.
నందగిరి హిల్స్ గురు బ్రహ్మ నగర్ లోని పేదల గుడిసెలను కూల్చి వేసే అధికారం హైడ్రా ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్ లకు ఎవరు అధికారం ఇచ్చారంటూ నిలదీశారు. పార్కుకు సంబంధించిన స్థలంగా చూపి కాంపౌండ్ వాల్ ను ఎలా నిర్మిస్తారంటూ నిప్పులు చెరిగారు దానం నాగేందర్.
ఈ విషయంలో హైడ్రా కమిషనర్, అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు అందజేస్తాననని హెచ్చరించారు. వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు ఎమ్మెల్యే. అంతే కాకుండా దీని గురించి తాను హైడ్రాకు చెంది ఏవీ రంగనాథ్ పై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
దానం నాగేందర్ వ్యక్తిగతంగా రంగనాథ్ ను టార్గెట్ చేశారు. కొత్తగా వచ్చిన పదవి తనకు ఇష్టం లేనట్టుంది..అందుకే తనను టార్గెట్ చేశారని, కేసు నమోదు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.