హెచ్చరించిన ఎమ్మెల్యే దానం నాగేందర్
హైదరాబాద్ – ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వార్నింగ్ ఇచ్చారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చి వేస్తారంటూ ఫైర్ అయ్యారు. ఎక్కడి నుంచో బతికేందుకు వచ్చినోళ్లు తమపై దౌర్జన్యం చేస్తారంటూ అంటూ నిలదీశారు. చింతల్ బస్తీ లోని షాదాన్ కాలేజీ ఎదురుగా ఉన్న కట్టడాలు కూల్చి వేయడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు ఆగాలని అన్నారు. ఆపక పోతే తాను ఆందోళన చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
ఇదిలా ఉండగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తో పాటు హెచ్ఎండీఏ అధికారులను సైతం తూలనాడారు. అనరాని మాటలన్నారు. తాను ఎంతో మంది సీనియర్ ఆఫీసర్లను చూశానంటూ కామెంట్ చేశారు. దీనిపై నాగేందర్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
సీఎం రేవంత్ రెడ్డి సైతం దీనిపై స్పందించ లేదు. ఎవరైనా సరే , చివరకు తమ పార్టీకి చెందిన వారైనా కబ్జాలకు పాల్పడినా లేదా ఆక్రమణలు చేపట్టినా ఊరుకోవద్దంటూ హైడ్రా కమిషనర్ ను ఆదేశించారు. మరో వైపు హైదరాబాద్ ఆక్రమణలకు గురైన చెరువుల జాబితాను ప్రకటించారు ఏవీ రంగనాథ్. మొత్తంగా దానం నాగేందర్ వర్సెస్ హైడ్రా కమిషనర్ గా వ్యవహారం మారి పోయింది.