విశాఖలో స్వచ్ఛ భారత్ .. పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్బంగా ర్యాలీ
విశాఖపట్నం – దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ , విశ్వ హిందూ పరిషత్ , రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భజరంగ్ దళ్ , అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, తదితర హిందూ సంస్థలు నరేంద్ర మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
మరో వైపు మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఏపీలోని విశాఖపట్నం నగరంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే , మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అత్యంత శక్తిమంతమైన దేశంగా భారత దేశాన్ని అగ్ర రాజ్యాల సరసన నిలబెట్టిన ఘనత ప్రధాని నరేంద్ర దామోదర దాస్ మోడీకే దక్కుతుందని కొనియాడారు మాజీ మంత్రి.
ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం సాగర్ నగర్ బీచ్ లో GVMC ఆధ్వర్యంలో భారీ ఎత్తున స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. ఇందులో గంటా శ్రీనివాస రావు పాల్గొన్నారు.
జోనల్ కమిషనర్ శైలజా వల్లి , టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులతో కలిసి బీచ్ పరిసరాలను శుభ్రం చేశారు గంటా శ్రీనివాసరావు.
ఈ సందర్బంగా విజయవాడ వరదల్లో 11 రోజుల పాటు నిరంతరంగా పని చేసిన 250 మంది GVMC పారిశుద్ధ్య సిబ్బందిని అభినందిస్తూ వారిని సత్కరించారు మాజీ మంత్రి.