DEVOTIONAL

సింహాద్రినాదుడు మహిమాన్వితుడు

Share it with your family & friends

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస‌రావు

విశాఖ‌ప‌ట్నం – సింహాచ‌లం శ్రీ వ‌ర‌హ‌ల‌క్ష్మీ నృసింహ స్వామి మ‌హిమ క‌లిగిన దేవుడంటూ కొనియాడారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస‌రావు. అప్ప‌న్న అలంక‌ర‌ణ‌ల‌తో కూడిన 2025 నూతన క్యాలెండ‌ర్ ను ఆవిష్క‌రించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. స్వామిని ద‌ర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయ‌ని, ఇబ్బందులు తొలిగి పోతాయ‌ని అన్నారు. ఉత్స‌వాల్లో అప్ప‌న్న స్వామికి చేసే అలంక‌ర‌ణ‌లు అపురూప‌మ‌న్నారు.

దేశంలోనే వరాహ, నారసింహ అవతారాల కలయిక సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి అని కొనియాడారు గంటా శ్రీ‌నివాస రావు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో అప్ప‌న్న క్యాలెండ‌ర్ ను రూపొందించ‌డం ప‌ట్ల ప్ర‌త్యేకంగా అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు.

ఆయా అలంకరణలతో ప్రత్యేకంగా క్యాలెండర్ రూపొందించి ముద్రించడం వాటిని భక్తులు కు అందించడం అభినందనీయమన్నారు. ఈ క్యాలెండర్ భక్తులకు కనువిందు చేస్తుందని, ప్రతీ ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుందని గంటా ఆకాంక్ష వ్య‌క్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కళా ఆసుపత్రి అధినేత డాక్టర్ పివి రమణమూర్తి, పుష్కర గణేష్, డాక్ యార్డ్ కేటీబి అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల చిరంజీవి, కాపు సామాజిక వర్గం నాయకులు తోట దుర్గారావు, విశ్వ తదితరులంతా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *