ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కామెంట్స్
అమరావతి – మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే డిమాండ్ పై తీవ్రంగా స్పందించారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇది మంచి పద్దతి కాదంటూ టీడీపీ మంత్రులు, నేతలకు హితవు పలికారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారని, ఈ సమయంలో ఇంకొకరికి ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. అయితే పార్టీ బలోపేతం కోసం నారా లోకేష్ తీవ్రంగా శ్రమించిన మాట కాదనలేమన్నారు. అందుకే సీఎం చంద్రబాబు తనకు కేబినెట్ లో చోటు కల్పించారని చెప్పారు.
మంగళవారం గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డితో పాటు సీనియర్లు సైతం నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై పార్టీ హైకమాండ్ సీరియస్ గా స్పందించింది.
ప్రస్తుతం బీజేపీ, జనసేన పార్టీలతో కలిసి కూటమి సర్కార్ నడుస్తోందని, ఏదైనా పార్టీ రూల్స్ కు వ్యతిరేకంగా మాట్లాడవద్దంటూ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అయినా ఎవరూ ఊరుకోవడం లేదు. తమ అభిప్రాయాలను చెబుతూనే వచ్చారు. నిన్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సైతం సీరియస్ గా స్పందించారు నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవిపై.