NEWSTELANGANA

చంద్ర‌బాబు బాట‌లోనే రేవంత్ రెడ్డి

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

సూర్యాపేట జిల్లా – రాష్ట్ర ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల‌ను బ‌డా బాబుల‌కు క‌ట్ట బెట్టేందుకు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. చంద్ర‌బాబు నాయుడు విధానాల‌నే రేవంత్ రెడ్డి పాటిస్తున్నాడ‌ని మండిప‌డ్డారు.

కేసీఆర్ నాయ‌క‌త్వంలోనే అన్ని ప్రాంతాల‌కు రోడ్లు, విద్యుత్ ఇవ్వ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. 10 ఏళ్ల కాలంలో తెలంగాణ‌ను దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ చేశామ‌న్నారు . కాంగ్రెస్ వ‌చ్చాక రోడ్ల‌తో పాటు విద్యుత్ ను కూడా కార్పొరేట్ల‌కు అప్ప‌గించేందుకు కుట్ర జ‌రుగుతోంద‌ని ఆరోపించారు.

అడ్డ‌గోలుగా క‌ట్ట బెడ‌తామంటే అడుగ‌డుగునా అడ్డుకుని తీరుతామ‌ని హెచ్చ‌రించారు జ‌గ‌దీశ్ రెడ్డి. సామాన్యులపై టాక్స్ భారం పెట్టేలా తీసుకున్న కాబినెట్ నిర్ణయంపై మండిపడ్డారు. కొరియా నుంచి వచ్చిన పొంగులేటి అన్నట్టుగానే మొదటి బాంబును గ్రామీణ ప్రజల గుండెల్లో దించాడని వాపోయారు.

ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కట్టబెడితే ప్రజల పై మరింత భారం ప‌డుతుంద‌న్నారు. క్యాబినెట్ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని.. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాడుతుంద‌న్నారు. రాష్ట్రాన్ని దోచి బడాబాబులకు కట్టబెటాలని చూస్తున్న కాంగ్రెస్ కుట్రలను అడుగడుగునా ఎండగడతామన్నారు. ప్రజల బతుకుల్లో చీకటి నింపే దుర్మార్గ ఆలోచన చేస్తున్న కాంగ్రెస్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్సరించారు.