ఫార్మా కంపెనీలపై ఎమ్మెల్యే కన్నెర్ర
బాధిత రైతులకు అనిరుధ్ రెడ్డి భరోసా
పాలమూరు జిల్లా – కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఎమ్మెల్యేను తన నియోజకవర్గంలోని రైతులు కలిశారు. జడ్చర్ల మండల పరిధిలోని పోలేపల్లి సెజ్ నుండి పంట పొలాలకు కలుషిత నీరు వస్తోందని, దీంతో తాము ఆరుగాలం కష్టపడి సాగు చేసుకున్న పంటలు చేతికి రావడం లేదని, అంతటా కలుషితం అవుతోందని వాపోయారు. ఎలాగైనా తమను కాపాడాలని కోరారు జనుంపల్లి అనిరుధ్ రెడ్డిని.
ఈ సందర్బంగా ఆయన రైతులకు పూర్తి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. తాను మీకు ఉన్నానని అన్నారు. ఈ సందర్బంగా పోలేపల్లి లో ఏర్పాటైన ఫార్మా కంపెనీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కలుషిత నీటిని బంద్ చేయాలని, లేక పోతే ఆయా కంపెనీలను తానే దగ్గరుండి తగుల బెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోలేపల్లి నుండి పంట పొలాలకు కలుషిత నీటిని అరబిందో ఫార్మా, హెటిరో, శిల్పా ఫార్మా కంపెనీలు కలుషిత నీటిని వదులుతున్నాయి. గతంలో సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ దివంగత మధు కాగుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అయినా పట్టించు కోలేదు.