NEWSTELANGANA

దొర అహంకారం అసెంబ్లీకి దూరం

Share it with your family & friends

ఎమ్మెల్యే క‌వ్వంప‌ల్లి స‌త్య నారాయ‌ణ

హైద‌రాబాద్ – ఎమ్మెల్యే క‌వ్వంప‌ల్లి స‌త్య నారాయ‌ణ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు మాజీ సీఎం కేసీఆర్ పై. అహంకారంతోనే స‌భ‌కు రావ‌డం లేద‌ని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ లో మాట్లాడారు.

దొర అహంకారానికి నిదర్శనమే పెద్ద దొర కేసీఆర్ సభకు రాక పోవ‌డ‌మ‌న్నారు ఎమ్మెల్యే. చిన్న దొరలు కేటీఆర్ ,హరీష్ రావు లు మాదిగలు మాట్లాడితే మేము వినాలా అని ఈరోజు వాకౌట్ చేశారని ఆరోపించారు.

సిఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క‌ ప్రతిపక్ష నేతగా ఉంటాడా అని ప్రతిపక్ష నాయకుడిగా లేకుండా చేశారని మండిప‌డ్డారు. మాదిగ ఉద్య‌మాన్ని చీల్చే ప్ర‌య‌త్నం కేసీఆర్ చేశాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు స‌త్య‌నారాయ‌ణ‌.

ఆనాడు బిడ్డ పెళ్లికి వెళ్ల‌కుండా రేవంత్ రెడ్డిని అడ్డుకున్న ఘ‌న‌త కేసీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు. సీఎం మాదిగ‌ల వ‌ర్గీక‌ర‌ణ‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇచ్చార‌ని తెలిపారు. మాదిగ‌ల అంద‌రి త‌ర‌పున రేవంత్ రెడ్డికి ధ‌న్యావాదాలు తెలియ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.