ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద చోటు చేసుకున్న ఎస్ఎల్బీసీ ఘటనకు సంబంధించి ఆరా తీశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఘటనా స్థలం వద్దే ఉన్నారు. దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఎల్బీసీలో పనులు జరుగుతుండగా ఎనిమిది మంది కార్మికులు కనిపించకుండా పోయారు. వారి ఆచూకి కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాయి. కేంద్ర, రాష్ట్ర బలగాలు, రెస్క్యూ టీమ్ లు కొలువు తీరాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు 13 కిలోమీటర్ల లోపటికి వెళ్లారు. కార్మికులతో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. ఆయన సంచలనంగా మారారు. మిగతా మంత్రులు ఇంతటి సాహసం చేయక పోవడం పట్ల విమర్శలు వచ్చాయి.
మరో వైపు సంబంధం లేని ఎమ్మెల్యేలు ఎలా వెళతారంటూ ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ కామెంట్స్ చేశారు భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నేతలు. దీనికి పూర్తి బాధ్యత సర్కార్ వ్యవహరించాలని అన్నారు.