కేసు కొట్టేయాలంటూ ఆదిమూలం పిటిషన్
ప్రాథమిక విచారణ లేకుడా కేసు నమోదు ఎలా
అమరావతి – టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. తాను అమాయకుడినని, తనకు ఏ పాపం తెలిదయని దాఖలు చేసిన దావాలో పేర్కొన్నారు ఎమ్మెల్యే .
తనపై నమోదు అయిన లైంగిక వేధింపులు కేసు కొట్టి వేయాలని ఈ సందర్బంగా కోరారు టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.
ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా, ఆరోపణల్లో నిజానిజాలు శోధించకుండా పోలీసులు కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
జూలై, ఆగస్టు నెలలో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
ఈ ఘటన ను హానీ ట్రాప్ గా పిటిషన్ లో పేర్కొన్నారు కోనేటి ఆధీమూలం. తనకు ప్రస్తుతం 72 సంవత్సరాలు అని. ఈ వయస్సులో తాను గుండె కు స్టెంట్ చేయించుకున్నాను అని తెలిపారు.
ఇదిలా ఉండగా ఎమ్మెల్యే ఆదిమూలం తనపై పలుమార్లు లైంగిక దాడి కి పాల్పడ్డారు అని టీడీపీ మహిళా నేత ఇచ్చిన ఫిర్యాదు పై ఈ నెల 5 న కేసు నమోదు చేశారు పోలీసులు.