నకిలీ డాక్యుమెంట్లతో భూములు కొట్టేశారు
శ్రీకాకుళం జిల్లా – మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కూన రవి కుమార్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్ల పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదల భూములు కాజేశారని మండిపడ్డారు.
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని, పైకి నీతులు చెబుతూ వచ్చారంటూ తమ్మినేనిపై కన్నెర్ర చేశారు కూన రవికుమార్. ఫేక్ (తప్పుడు) ధృవపత్రాలు (సర్టిఫికెట్లు ) సృష్టించడంలో మాజీ స్పీకర్ ఎక్స్ పర్ట్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు కూన రవికుమార్.
ఇందుకు సంబంధించి మాజీ స్పీకర్ చేసిన నిర్వాకం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కు, సీఐడీకి ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాల్సిందిగా తాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు.