ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
ఎల్లారెడ్డి – కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ఈ గ్యారెంటీల విషయంలో స్పష్టమైందని పేర్కొన్నారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆదివారం మహా లక్ష్మీ, గృహ జ్యోతి పథకాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా లబ్దిదారులను ఉద్దేశించి ప్రసంగించారు.
తాము ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం చెప్పింది చేసి చూపిస్తోందన్నారు. ఇవాళ తాము ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల లక్షలాది మహిళలకు మేలు చేకూరిందని చెప్పారు.
అంతే కాకుండా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని, వీటిని మాఫీ కూడా చేయడం జరిగిందన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకే తాము వీటిని అమలు చేయడం జరుగుతోందని అన్నారు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు.
ఈనెల 11న ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టనుందన్నారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు.