చంద్రబాబు పనితీరు భేష్ – మల్లారెడ్డి
తిరుమలను దర్శించుకున్న మాజీ మంత్రి
తిరుమల – తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి , ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తిరుమలను దర్శించుకున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు సీఎంగా కొలువు తీరాక కొంత మార్పు వచ్చిందన్నారు. భారీ ఎత్తున వర్షాలు, వరదలు వచ్చినా ఎక్కడా చెక్కు చెదరకుండా 74 ఏళ్ల వయస్సులో సైతం చంద్రబాబు నాయుడు సహాయక చర్యలలో పాల్గొనడం , నిరంతరం సమీక్ష చేపట్టడం అభినందనీయమన్నారు.
తాను ప్రత్యేకంగా ఏపీ సీఎంను ప్రశంసిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా ఈ వయసులో ఇంటి వద్ద ఉంటారని, విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారని కానీ చంద్రబాబు నాయుడు అలా కాదన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం వల్ల ప్రస్తుతం వరదల నుంచి ఏపీని రక్షించారని కొనియాడారు చంద్రబాబు నాయుడును చామకూర మల్లారెడ్డి.
తాను ఏది కోరుకుంటే శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అది కల్పిస్తూ వచ్చారని తెలిపారు. తాను తిరుమలకు నడుచుకుంటూ వచ్చానని చెప్పారు. తెలంగాణలో సైతం వరదలు వచ్చాయని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు చామకూర మల్లారెడ్డి.
తాను ఆ కలియుగ వేంకటేశ్వర స్వామిని ఇరు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని ప్రార్థించినట్లు చెప్పారు మాజీ మంత్రి.