పోలీసుల తీరు దారుణం – కౌశిక్ రెడ్డి
దళితుల కోసం పోరాడుతూనే ఉంటా
హైదరాబాద్ – దళిత బంధు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన పాపానికి తనపై అకారణంగా పోలీసులు దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు.
దళిత బంధు ఇవ్వాలని కోరుతూ న్యాయ బద్దంగా తాను భారత రాజ్యాంగ స్పూర్తి ప్రదాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా శాంతియుతంగా ఆందోళన చేపట్టిన తనను అకారణంగా అరెస్ట్ చేశారంటూ వాపోయారు పాడి కౌశిక్ రెడ్డి.
ప్రజా సమస్యల గురించి ప్రస్తావించడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇదేనా ప్రజా పాలన అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం కావాలని అణిచి వేసేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తనపై దాడి చేయడంతో తాను శ్వాస పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డానని వాపోయారు ఎమ్మెల్యే.
తన పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా మారిందని, ఆస్పత్రికి తీసుకోక పోయి ఉండక పోతే పరిస్థితి వేరే లాగా ఉండేదన్నారు.