ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్
హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీస్ యూనిఫాంకు మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. జమ్మికుంట పట్టణ సీఐ వరిగంటి రవి అవినీతి తిమిలంగా మారారని, రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని అన్నారు. యూనిఫాం ధరించి ప్రజల నమ్మకాన్ని దోచుకోవడం దుర్మార్గమన్నారు. హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డీజీపీని.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. పోలీస్ డిపార్ట్ మెంట్ ను తాము తప్పు పట్టడం లేదన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కాక పోతే ఇందులో కొందరు మాత్రం రూల్స్ కు విరుద్దంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రోజు రోజుకు ప్రజలకు పోలీసులంటే నమ్మకం పోయేలా ఉందన్నారు.
తెలంగాణ డీజీపీ, ఏసీబీ డీజీ, కరీనంగర్ ఎస్పీలు ఇలాంటి అవినీతి తిమింగలాలను సస్పెండ్ చేయాలని, నిజాయితీకి గౌరవం చేకూర్చేలా చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే .