ఛాన్స్ ఇస్తే ఎమ్మెల్యేలను గెలిపిస్తా
ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కామెంట్
హైదరాబాద్ – బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన పార్టీ హైకమాండ్ కు కీలక సూచన చేశారు. తనకు అవకాశం ఇస్తే మూడు జిల్లాల్లో 18 ఎమ్మెల్యేలను దగ్గరుండి గెలిపిస్తానని లేక పోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు తనకు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే.
సోమవారం పైడి రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ బలోపేతం కోసం పాటు పడతానని చెప్పారు. ఇప్పటికే పార్టీ పరంగా అత్యధికంగా సభ్యత్వాలను నమోదు చేయించానని అన్నారు. ప్రస్తుతం ప్రజలు రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని స్పష్టం చేశారు.
గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ చేసిన నిర్వాకాన్ని ప్రజలు ఇంకా మరిచి పోలేదన్నారు. ఇక ఏడాది పాలనకే జనం కాంగ్రెస్ ను, సీఎంను ఆదరించడం లేదని పేర్కొన్నారు. ఈ తరుణంలో ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారని చెప్పారు. అందుకే తాను ఆ మూడు కీలక జిల్లాలకు ఇంఛార్జి బాధ్యతలు కావాలని అడిగినట్లు తెలిపారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు.