అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించి రికార్డ్
ఢిల్లీ – ఢిల్లీలో బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. 27 ఏళ్ల అనంతరం అధికారంలోకి వచ్చింది. ఈ సందర్బంగా ఎవరు సీఎం అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేశ్ వర్మ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ప్రస్తుతం పార్టీ హై కమాండ్ ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనే దానిపై ఫోకస్ పెట్టింది. మోడీ, అమిత్ షా ఎవరికి ఛాన్స్ ఇస్తారని పార్టీ శ్రేణులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. పర్వేశ్ వర్మనే బెస్ట్ ఛాయిస్ గా భావిస్తున్నట్లు సమాచారం.
ప్రధానంగా పర్వేశ్ వర్మ నిత్యం వార్తల్లో ఉంటూ వచ్చారు. మైనార్టీలను టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. న్యూఢిల్లీ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు. ఆయన ఇదే లోక్ సభ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. దేశ రాజధానిలో ప్రముఖ జాట్ నాయకుడిగా గుర్తింపు పొందారు.
మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు, రెండుసార్లు ఎంపీ సందీప్ దీక్షిత్ కూడా ఇదే స్థానం నుండి పోటీ చేసినా ఫలితం లేక పోయింది. ప్రస్తుతం పర్వేశ్ వర్మపైనే ఎక్కువగా అధిష్టానం దృష్టి సారించింది. తననే తదుపరి ముఖ్యమంత్రిగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం.