మోహన్ బాబూ క్షమాపణ చెప్పు
ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్
హైదరాబాద్ – బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ నిప్పులు చెరిగారు. వివాదాస్పద నటుడు మోహన్ బాబు వెంటనే మీడియాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీ కుటుంబ సమస్య ఇంటి వరకే ఉంటే బాగుంటుందన్నారు. గాయపడిన జర్నలిస్టు రంజిత్ ను పరామర్శి\స్తే మీకే మంచిదని హితవు పలికారు. లేకపోతే ఇబ్బందులు తప్పవన్నారు. ఇష్యూని ఇలాగే వదిలేస్తే మరింత పెద్దదవుతుందన్నారు.
గురువారం సోషల్ మీడియా వేదికగా వీడియో సందేశం ఇచ్చారు. మోహన్ బాబు పూర్తిగా తప్పు చేశారంటూ పేర్కొన్నారు. రాజా సింగ్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ఒక నటుడిగా, తండ్రిగా, పెద్ద వయసు కలిగిన వ్యక్తిగా ఆదర్శంగా ఉండాల్సిన మీరు ఇలా ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే రాజా సింగ్.
ఇదిలా ఉండగా మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు చోటు చేసుకున్నాయి. తండ్రీ కొడుకుల మధ్య భేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇద్దరినీ విచారణకు పిలిపించారు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ కుమార్.