Friday, April 4, 2025
HomeNEWSస్వంత పార్టీ నేత‌ల‌పై రాజాసింగ్ క‌న్నెర్ర‌

స్వంత పార్టీ నేత‌ల‌పై రాజాసింగ్ క‌న్నెర్ర‌

ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీపై ఫైర్

హైద‌రాబాద్ – బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మ‌రోసారి రెచ్చి పోయారు. స్వంత పార్టీ నేత‌ల‌పై నిప్పులు చెరిగారు. వారిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొంద‌రు బీజేపీ నేత‌లు ఫాల్తుగాళ్లు అంటూ అనుచిత కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఓవైసీ బ్ర‌ద‌ర్స్ పై కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రంజాన్ మాసంలో హిందువుల‌పై విషం కక్కుతున్నారంటూ ఆరోపించారు. తెలంగాణ‌లో బీజేపీ ప‌వ‌ర్ లోకి వ‌స్తే పారి పోయే తొలి వ్య‌క్తి ఓవైసీ అవుతాడంటూ పేర్కొన్నారు. ఆయ‌న‌కు పిచ్చెక్కింద‌ని , చికిత్స ఇప్పించాల‌ని సీఎంను కోరారు.

శ‌నివారం ఎక్స్ వేదిక‌గా వీడియో సందేశం ద్వారా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం బీజేపీలో క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న గ‌త కొంత కాలంగా త‌మ పార్టీకి చెందిన కొంద‌రు నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని వ్యాఖ్యానించ‌డం ఒకింత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. ఇదే స‌మ‌యంలో హైద‌రాబాద్ లో ప‌ర్య‌టిస్తున్నారు బీజేపీ చీఫ్‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. రాజాసింగ్ చేసిన కామెంట్స్ పై ఇంకా స్పందించ లేదు. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య తీసుకుంటుందా అనేది వేచి చూడాలి. ఎందుకంటే న‌గ‌రంలో పెద్ద ఎత్తున రాజాసింగ్ కు క్యాడ‌ర్ ఉంది. ఏ పార్టీ వ‌చ్చిన‌ప్ప‌టికీ త‌న‌దైన శైలిలో గెలుస్తూ వ‌స్తున్నాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments