గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్
హైదరాబాద్ – గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. ఇక నీకు జైలే గతి అంటూ పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో తనను అక్రమంగా జైల్లో పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు కూడా నీకు అదే గతి పట్టక తప్పదన్నారు. జైలుకు వెళ్లే ముందు 4 జతల బట్టలు, దుప్పటి, టవల్, కర్చీఫ్, సబ్బులు, చట్నీలు తీసుకు వెళ్లండి అంటూ సెటైర్ వేశారు. అయితే స్వెటర్ తీసుకెళ్లడం మరిచి పోవద్దంటూ హితవు పలికారు.
ఇదిలా ఉండగా గురువారం ఎక్స్ వేదికగా ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం సాగించిన ఆధిపత్య ధోరణే ఇవాళ అధికారంలో లేకుండా చేసిందని పేర్కొన్నారు .
ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పారని, చరిత్రలో ఎవరైనా సరే ఇదే గతి పడుతుందన్నారు. శాసనసభలో సైతం తమను మాట్లాడనీయకుండా అడ్డుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే రాజా సింగ్.