హిందూ ధర్మానికి జగన్ తీరని ద్రోహం
నిప్పులు చెరిగిన గోషా మహల్ ఎమ్మెల్యే
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. తిరుమల కొండను అపవిత్రం చేశారని ఆవేదన చెందారు. అందుకే స్వామి వారి దెబ్బకు ఓడి పోయాడంటూ ఎద్దేవా చేశారు.
ట్విట్టర్ వేదికగా వీడియోను షేర్ చేశారు రాజా సింగ్. ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి సర్కార్ కు కంగ్రాట్స్ తెలిపారు. ఇదే సమయంలో మాజీ సీఎం చేసిన నిర్వాకాన్ని ఎత్తి చూపారు. గతంలో కన్వర్ట్ క్రిస్టియన్ జగన్ అధికారంలోకి రాగానే హిందూ ధర్మానికి తీవ్ర నష్టం చేశారని ఆరోపించారు.
ప్రాచీన దేవాలయాలను కావాలని దెబ్బ తీశారని మండిపడ్డారు. తిరుమలలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇవ్వడం, కన్వర్ట్ క్రిస్టియన్ అయిన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా చేశారని ధ్వజమెత్తారు. జగన్ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బ తీశారని.. మాంసం, మందు కూడా కొండ పైకి తరలించారని ఫైర్ అయ్యారు.
ఇవ్వన్నీ గమనించాకే ఏపీ ప్రజలు జగన్ పాలనలో ఆంధ్ర సురక్షితంగా ఉండదని భావించి ఓడించారన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే చంద్రబాబు తిరుమలలో అధర్మమైన పనులు చేస్తే సహించేది లేదని తేల్చిచెప్పారని గుర్తు చేశారు. తిరుమలలో ఎలా అయితే ధర్మ పరిరక్షణ చేస్తామని చెప్పారో.. అలాగే శ్రీశైలంలో కూడా హిందూ ధర్మ వ్యతిరేకుల రాజ్య మేలుతున్నారని మండి పడ్డారు. ఏపీలో ఉన్న ప్రాచీన దేవాలయాల్లో హిందూ ధర్మాన్నే ప్రచారం చేసేలా చూడాలని కోరారు. .