ఒడిశా సర్కార్ పై సోఫియా ఫైర్
రాజ్యాంగంలో మార్పుపై ఆగ్రహం
ఒడిశా – కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోఫియా ఫిర్దోస్ సీరియస్ అయ్యారు. ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒడిశా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం పట్ల వారికి ఎలాంటి గౌరవం లేదని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు.
ప్రజలు అధికారం ఇచ్చారని ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు సోనియా ఫిర్దోస్ . వ్యవస్థలన్నింటిని బలోపేతం చేసేందుకు ప్రజాస్వామ్యం ఉపయోగ పడుతుందని, దానికి రక్షణ కవచంగా ఉండేది భారత రాజ్యాంగమని స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే.
మెరుగైన పాలన అందిస్తారని వారికి అధికారం కట్టబెడితే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా, ప్రజాస్వామ్యాన్ని కించ పరిచేలా చర్యలు తీసుకోవడం దారుణమన్నారు సోఫియా ఫిర్దోసి. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
దీనిని ఏ వర్గమూ, ఏ సమూహమూ సమర్థించదని స్పష్టం చేశారు. వ్యవస్థలను కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని , ఆ విషయం బీజేపీ ఒడిశా ప్రభుత్వం తెలుసుకుంటే మంచిదని సూచించారు.