ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు
తాడేపల్లి గూడెం – సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. స్వంత కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని దద్దమ్మ అంటూ మండిపడ్డారు. ఇక మిమ్మల్ని ఎలా గెలిపిస్తాడంటూ ఎద్దేవా చేశారు.
ఏనాడైనా బీసీ, ఎస్సీలను రాజ్యసభకు పంపావా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ భవనం దగ్గర సెల్ఫీ దిగి.. ప్రజలకు అంకితం ఇస్తావా లోకేశూ అంటూ ఎద్దేవా చేశారు సుధాకర్ బాబు. 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్ట గలిగే దమ్ముందా అంటూ నిప్పులు చెరిగారు.
ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదన్నారు. స్వయం కృషితో ఎదిగిన దళిత బిడ్డలకు ముందుండి సహకరించిన వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు ఎమ్మెల్యే. కార్యకర్తలను ఎమ్మెల్యేలు, ఎంపీలను చేసిన హీరో అంటూ కితాబు ఇచ్చారు సుధాకర్ బాబు.
చంద్రబాబు జీవితమంతా కుట్రలు, కుతంత్రాలు తప్ప చేసింది ఏమీ లేదన్నారు ఎమ్మెల్యే. తామంతా నిజమైన నాయకుడితో ఉంటామని కానీ దొంగల ముఠాతో ఉండబోమంటూ స్పష్టం చేశారు. ప్రజలకు చేసిన మేలును ప్రచారం చేసుకోవటానికే ఈ సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.