NEWSTELANGANA

సిరిసిల్ల‌ కంటే ధీటుగా అభివృద్ది చేస్తా

Share it with your family & friends

ఖానా పూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప‌టేల్

హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప‌టేల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఆయ‌న స్పందించారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిరిసిల్ల కంటే ఖానాపూర్ నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని రంగాల‌లో ముందంజ‌లో ఉండేలా కృషి చేస్తాన‌ని అన్నారు.

ఇదే స‌మ‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఖానాపూర్ మండ‌లంగా మాత్ర‌మే ఉంద‌న్నారు. దీనిని వెంట‌నే రెవిన్యూ డివిజ‌న్ గా ఏర్పాటు చేయాల‌ని వెడ్మ బొజ్జు ప‌టేల్ డిమాండ్ చేశారు. అంతే కాకుండా మండ‌ల కేంద్రంలో వెంట‌నే డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాల‌ని కోరారు. ఇప్ప‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన 317 జీవోను ర‌ద్దు చేయాల‌ని అన్నారు. లేక పోతే ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని పేర్కొన్నారు.

ప్ర‌భుత్వం వెంట‌నే త‌మ నియోజ‌క‌వ‌ర్గంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాల‌ని , అంతే కాకుండా ప్ర‌త్యేకంగా నిధులు మంజూరు చేయాల‌ని కోరారు ఖానాపూర్ ఎమ్మెల్యే. గ‌త ప్ర‌భుత్వం ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌ట్ల వివ‌క్ష చూపింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీని వ‌ల్ల పూర్తిగా వెనుక‌బాటుకు గురైంద‌ని వాపోయారు.