NEWSANDHRA PRADESH

గుడ్ల‌వ‌ల్లేరు కాలేజీ ఘ‌ట‌న ఎమ్మెల్యే స్పంద‌న‌

Share it with your family & friends

విద్యార్థులు ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్దు

విజ‌య‌వాడ – గుడ్ల‌వ‌ల్లేరు ఇంజ‌నీరింగ్ కాలేజీ లో చోటు చేసుకున్న ఘ‌ట‌న ప‌ట్ల స్పందించారు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. నిష్ప‌క్ష పాతంగా ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు వెనిగండ్ల రాము.

నిష్పక్ష పాతంగా దర్యాప్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. విద్యార్థులు ఎవరు ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్యే అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. అక్క‌డి నుంచి ఫోన్ ద్వారా స‌మాచారం తెలుసుకున్నారు.

గురువారం రాత్రి కళాశాలలో జరిగిన‌ పరిణామాలపై స్పందించారు. కళాశాలలో విద్యార్థులు చేస్తున్న ఆరోపణలపై ఎలాంటి ఒత్తిళ్ల‌కు గురి కాకుండా విచార‌ణ చేప‌ట్టాల‌ని సూచించారు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.

ఈ ఘటన వెనుక ఎంతటి వారు ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. దయచేసి విద్యార్థులు అపోహలను నమ్మవద్దని, ఆధారాలు లేని విషయాలను ప్రచారం చేయవద్దంటూ ఎమ్మెల్యే కోరారు.

ఎటువంటి వివక్ష లేకుండా గుడ్లవల్లేరు ఘటనపై దర్యాప్తు జరుగుతుందని, విద్యార్థి లోకానికి తాను అన్ని వేళల అండగా ఉంటానని వెనిగండ్ల రాము హామీ ఇచ్చారు.