ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కామెంట్
జనగామ జిల్లా – సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ అభాగ్యుల కోసం ఆపన్న హస్తం అందిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఏర్పాటు చేసిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ను ప్రశంసలతో ముంచెత్తారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలో నిర్మించిన మహిళ వృధ్యాప్య ఆశ్రమం ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రులు, సహచర శాసన సభ్యులతో కలిసి పాల్గొన్నారు పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సి రెడ్డి. ఆమెతో ఇంఛార్జ్ నాయకురాలు ఎమ్మెల్యే అత్త ఝాన్సీ రెడ్డి కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా యశస్విని ఝాన్సి రెడ్డి గారు మాట్లాడారు. గత కొన్నేళ్లుగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సామాజిక కార్యక్రమాలను చేపడుతుండడం తనకు సంతోషం కలిగించిందని చెప్పారు. వృద్ధ మహిళల కోసం ప్రత్యేక వృద్ధాశ్రమాన్ని నిర్మించి నిరాశ్రయులకు నీడ కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.