Saturday, April 5, 2025
HomeNEWSANDHRA PRADESHజర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్

గుంటూరు – రాష్ట్రంలోని జర్నలిస్టుల దీర్ఘకాల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. 1985 నుండి ఆలపాటితో సాన్నిహిత్యం కలిగిన సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు స్వగృహంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. గడిచిన నాలుగు దశాబ్దాలకు పైగా విద్యార్థి దశ నుంచి జర్నలిస్టులతో సాన్నిహిత్యం కలిగిన ఆలపాటికి జ‌ర్న‌లిస్టుల‌ కష్ట సుఖాలు, ఇతర బాధలు, సమస్యలు అన్నీ బాగా తెలుసన్నారు.

అర్హులైన జర్నలిస్టులు అందరికీ తక్షణం అక్రెడిటేషన్ తో పాటు ప్రధానంగా ఇళ్ల స్థలాలు ఇవ్వటంపై దృష్టి సారించాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి 2014-19లో నాటి సీఎం చంద్రబాబు జారీ చేసిన జీవోలన్నీ గత ప్రభుత్వ హయాంలో బుట్ట దాఖ‌లు చేశార‌ని ఆరోపించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో సరికొత్త జీవోలు వచ్చినా అడుగు ముందుకు పడలేదన్నారు. ఆలపాటి ప్రాతినిధ్యం వహించే పట్టభద్రుల నియోజకవర్గం ఆరు జిల్లాలు, 33 శాసనసభ నియోజకవర్గాలతో విస్తరించి వుందని, రాష్ట్రం మొత్తంపై అత్యధికంగా జర్నలిస్టులు ఈ నియోజకవర్గం పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారనేది మరువరాదని నిమ్మరాజు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments